Naveen: నాన్నమ్మ – అమ్మ కోరుకున్న స్థాయిలో నేను లేను: నవీన్‌ విజయ్‌ కృష్ణ!

నవీన్‌ విజయ్‌ కృష్ణ… టాలీవుడ్‌లో ఈయనో ఆల్‌ రౌండర్‌ అని చెప్పొచ్చు. నటుడిగా తొలుత తెర మీద కనిపించినా.. అంతకుముందే ఆయనలోని సాంకతిక నిపుణుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎడిటర్‌గా పని చేశారు. ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తారు. అదే ‘సోల్‌ ఆఫ్‌ సత్య’. సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా తెరకెక్కిన ఈ సింగిల్‌ ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. దీనిని నవీన్‌ విజయ్‌ కృష్ణనే తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో నవీన్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు.

తన నాన్నమ్మ విజయనిర్మల, తల్లి నేత్ర కోరుకున్న స్థాయిలో తాను ఉండలేకపోయానని ఎమోషనల్‌గా మాట్లాడారు నవీన్ విజయకృష్ణ. అలా ఉండలేకపోయననే బాధతోనే ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్నానని కూడా చెప్పాడు. జీవితంలో ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను ముందుకు రావడానికి నా ధైర్యం, కారణం… నా మనసులో ఉన్న కీర్తిశేషులు మా నాన్నమ్మ విజ‌య నిర్మల‌, మా అమ్మ నేత్రలే. ఎప్పుడూ న‌న్ను జీవితంలో మంచి స్థాయిలో చూడాల‌ని వాళ్లు కోరుకున్నారు. అయితే అది ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది.

అందుకే కెరీర్‌ విషయంలో ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. అంతేకాదు ఇప్పుడు ‘స‌త్య’ వీడియో చేశాను అంటే దానికి వాళ్లే కార‌ణం అని చెప్పారు నవీన్‌ విజయ్‌ కృష్ణ. ‘స‌త్య’ కాన్సెప్ట్ రాసిన‌ప్పుడు, తీసిన‌ప్పుడు ఎమోష‌న్‌తోనే చేశాను. మ‌నం ఎవరినైనా మిస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పాట ద్వారా చూపించాలనుకున్నాం. దాని కోసం శ్రుతి రంజ‌ని అంద‌మైన ట్యూన్‌ ఇచ్చారు. ఆ ట్యూన్‌కీ, ఫీల్‌కి క‌నెక్ట్ అయ్యి ఈ పాటను రూపొందించాను అని నవీన్‌ తెలిపారు.

నా మీద గుడ్డి న‌మ్మకంతో సాయి ధరమ్‌ తేజ్ ‘సత్య’ళో నటించాడు అని చెప్పిన నవీన్‌… తేజ్‌ న‌మ్మకం చూసి భ‌య‌మేసింది అని చెప్పారు. సాయితేజ్‌, నవీన్‌ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఆ బంధంతోనే సాయితేజ్‌ ఈ పాటకు ముందుకొచ్చాడని చెప్పొచ్చు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus