హీరోయిన్ నవనీత్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేసేది. తన అందాలతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసి మాయమైపోయింది. ‘శీను వాసంతి లక్ష్మి’ ‘జగపతి’ ‘గుడ్ బాయ్’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం ఈమె ఓ రాజకీయ నాయకురాలు. 2109 లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుండీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆమె పదవికి గండం పడినట్టు స్పష్టమవుతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె జారీ చేసిన ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ అని తెలుస్తుంది.ఈమె నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లుగా మంగళవారం నాడు బాంబే హైకోర్టు తీర్మానించింది. దానిని రద్దు చేయడమే కాకుండా ఈమెకు రూ.2 లక్షల ఫైన్ కూడా విధించడం జరిగింది. నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈమె బి.జె.పి పార్టీకి మద్దతుదారుగా వ్యవహరిస్తూ వస్తుంది.
ఈ కారణంతోనే నవనీత్ కౌర్…తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్టు శివసేన నాయకులలో ఒకరు బాంబే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ క్రమంలో అతని అభియోగాలు నిజమే అని కోర్టు తేల్చి చెప్పింది.ఈమె లోక్ సభలో బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి హైకోర్టు తీర్పుతో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!