కేసీయార్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు
- August 19, 2017 / 01:00 PM ISTByFilmy Focus
బాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం టాప్ రేటెడ్ ఆర్టిస్ట్ అండ్ మోస్ట్ పెయిడ్ యాక్టర్ గా బాలీవుడ్ లో మన్ననలు అందుకొంటున్న నవాజుద్దీన్ సిద్దికీ కోసం బాలీవుడ్ హీరోలందరూ క్యూ కట్టారు. నా సినిమాలో ఆయనుండాలి అంటే నా సినిమాలో కావాలి అంటూ ఖాన్ లు మొదలుకొని కపూర్ ల వరకూ అందరూ నవాజుద్దీన్ కోసం వెయిట్ చేస్తున్న వారే. కానీ.. నవాజుద్దీన్ మాత్రం తెలుగు వైపు మొగ్గు చూపాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ జీవితం ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రంలో టైటిల్ పాత్రధారి కోసం గత కొన్నేళ్లుగా వెతుకుతూ వచ్చిన మధుర శ్రీధర్ ఫైనల్ గా నవాజుద్దీన్ సిద్దికీని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ వార్తకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నప్పటికీ.. దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లేనని సన్నిహిత వర్గాల సమాచారం. నటుడిగా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నవాజుద్దీన్ సిద్దిఖీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గా ఏమేరకు అలరిస్తాడో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















