Nayakudu: సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకి జనాలు లేక షోలు క్యాన్సిల్.. కలెక్షన్స్ దారుణం

తమిళంలో ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్… ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో వడివేలు, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్ ని తీసుకుని సన్నివేశాలు రాసుకుని కథనాన్ని నడిపిస్తూ ఉంటారు. అక్కడ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఓపెనింగ్స్ అదిరిపోయాయి. వీక్ డేస్ లో కూడా పాజిటివ్ టాక్ పవర్ తో స్ట్రాంగ్ గా రన్ అయ్యి .. రూ.60 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో నిన్న అంటే జూలై 14 న రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మంచి రివ్యూలు, రేటింగ్ లు పడ్డాయి. కానీ తెలుగు రాష్ట్రాల మొత్తం మీద ఈ సినిమా రూ.5 లక్షల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి.

అందుకు కారణం కూడా ఉంది. నిన్న ‘బేబీ’ అనే క్రేజీ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి జనాలు క్యూలు కడుతున్నారు. అలాగే శివ కార్తికేయన్ ‘మహావీరుడు’ సినిమాకి కూడా జనాలు బాగా వెళ్తున్నారు. అది ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమా కాబట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ తరలివెళ్తున్నారు. ‘సామజవరగమన’ చిత్రం ఈ వీకెండ్ కి కూడా స్ట్రాంగ్ గా రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ‘నాయకుడు’ (Nayakudu) చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు అని స్పష్టమవుతుంది. పైగా ఉదయనిధి స్టాలిన్ కి తెలుగులో పెద్ద మార్కెట్ లేదు.పోనీ వడివేలు, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్ వంటి వారు సినిమాను ప్రమోట్ చేసింది కూడా ఏమీ లేదు. ఒకవేళ ప్రమోషన్స్ బాగా చేసుంటే.. వీకెండ్ కలెక్షన్స్ తో ఈ మూవీ గట్టెక్కేదేమో.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus