Nayanatara, Vignesh: లక్ష మంది చిన్నారులకు అన్నదానం చేయనున్న నూతన దంపతులు!

నయనతార విగ్నేష్ శివన్ గత కొద్ది రోజుల నుంచి ఈ పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో అప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే నేడు ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ అంగరంగ వైభవంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని రిసార్ట్ లో కుటుంబ సభ్యులు సన్నిహితులు పలువురు సినీ సెలబ్రిటీలు సమక్షంలో ఈ జంట ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇకపోతే హిందూ సాంప్రదాయాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి కాగానే ఒక ఏకంగా లక్ష మంది అనాధ చిన్నారులకు భోజనాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా నయనతార విగ్నేష్ అనాధ పిల్లలకు భోజనాలు పెడుతూ వీరి మంచి మనసు చాటుకున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన ఏ విధమైనటువంటి పెళ్లి ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచారం. నయనతార విగ్నేష్ వీరి పెళ్లి వేడుకను ప్రముఖ డిజిటల్ మీడియా నెట్ ఫ్లిక్ 2.5 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. ఈ విధంగా వీరి పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్ లో అమ్మడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మహాబలిపురంలో కేవలం అతిథుల అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట చెన్నైలో ఎంతో ఘనంగా స్టార్ హోటల్లో తమ వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ లో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1

2

3

4

5

6

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus