Nayanatara, Vignesh: విఘ్నేష్ నయన్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల వివాహం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నయన్ విఘ్నేష్ త్వరలో ఇండియాకు తిరిగి వచ్చి సినిమాలతో బిజీ కానున్నారు. అయితే నయన్ విఘ్నేష్ సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో సంపాదించారని సమాచారం అందుతోంది. వీళ్లిద్దరి ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో ఉందని తెలుస్తోంది. నయన్ విఘ్నేష్ ఆస్తుల విలువ 220 కోట్ల రూపాయలు అని ఈ మొత్తంలో నయనతార ఆస్తి మూడు వంతులు కాగా విఘ్నేష్ ఆస్తి ఒక వంతు అని సమాచారం అందుతోంది.

సినిమాల ద్వారా ఈ స్థాయిలో సంపాదించడం సులువు కాదనే సంగతి తెలిసిందే. నయనతార ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. పలు కంపెనీల ఉత్పత్తులను సైతం నయన్ ప్రమోట్ చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ సక్సెస్ రేట్ తక్కువే అయినా కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. నయన్ విఘ్నేష్ ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని సమాచారం అందుతోంది.

నయనతార చేతిలో ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లు ఉండగా విఘ్నేష్ శివన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నయనతార తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి చెల్లి పాత్రలో నయనతార నటిస్తుండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం వల్లే నయనతార ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నయనతార టాలీవుడ్ సినిమాల కంటే కోలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు నయనతార ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus