Nayani Pavani: 9 వ వారం తారుమారు అయిన ఎలిమినేషన్.. ఫైనల్ గా ఆమె బయటకి..!

బిగ్ బాస్ తెలుగు 8 (Bigg Boss 8 Telugu) నుండీ ఈ వారం అనగా 9వ వారం ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఒకరైన నయని పావని ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. శనివారం అంటే నవంబర్ 2 నాడు షూట్ చేసిన ఈ ఎపిసోడ్ నవంబర్ 3న టెలికాస్ట్ కానుంది. ఇక 9వ వారం నామినేషన్స్‌లో 5 మంది నామినేట్ అయ్యారు. వాళ్లే గౌతమ్, యష్మీ (Yashmi Gowda), హరితేజ (Hari Teja) , టేస్టీ తేజ, నయని పావని (Nayani Pavani) వంటి వారు. వీళ్లందరిలో నయని పావనికి తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం.

Nayani Pavani

అందరికంటే ఎక్కువగా యష్మీకి నమోదు అయ్యాయట. ఆమెనే టాప్ ప్లేస్ లో ఉంది. టేస్టీ తేజ, హరితేజ, నయని పావని..లకి సమానంగా ఓట్లు పడ్డాయి. కానీ చివర్లో నయని పావని వెనుక పడినట్లు స్పష్టమవుతోంది. అలా ఈ వారం ఆమె హౌస్ లో నుండీ బయటకి వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కూడా వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు మొదటి వారమే ఎలిమినేట్ అయింది. అయితే, ఈ సీజన్‌లో వచ్చినప్పటి నుండి నామినేట్ అవుతున్నప్పటికీ..

ఆట మధ్యలో ఉన్నప్పుడు అది పెద్ద విషయం కాదు అనే చెప్పాలి. ఈ టైమ్ లో ఆప్షన్ ఉండదు కాబట్టి నామినేట్ అవుతారు. ఇక రోజుకి రూ.21 వేల చొప్పున మొత్తంగా రూ.5.5 లక్షలకు పైగా పారితోషికం అందుకుందట నయని పావని. అది చిన్న విషయం కాదు అనే చెప్పాలి.

 ప్రభాస్ బ్రహ్మరక్షసుడా.. వర్మ ప్లాన్ ఏంటీ?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus