Jawan Movie: జవాన్ సినిమా కోసం నయనతార విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇదివరకు ఈమెకు పలు బాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల బాలీవుడ్ సినిమాలలో నటించలేదు. ఈ క్రమంలోనే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతినే విలన్ గా తీసుకున్నారు. నయనతార విజయ్ సేతుపతి ఇద్దరికీ ఇది మొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం అయితే ఈ సినిమా కోసం వీరిద్దరూ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా (Jawan Movie) కోసం నయనతార ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. నయనతార సినీ కెరియర్ లోనే ఈ సినిమాకు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకొని సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా నిలిచారు. ఇక ఈ సినిమా కోసం నటుడు విజయ్ సేతుపతి 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనీ తెలుస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus