Nayanthara: నయనతార కి చేదు అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో!

Advertisement

నయనతార, విగ్నేష్‌ శివన్‌ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా టూర్లు వేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో వీళ్ళు కనిపిస్తున్న ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓ పక్క ఫారెన్ టూర్లు వేస్తూనే మరోపక్క గుళ్లు, గోపురాల చుట్టూ కూడా తిరుగుతున్నారు. తమిళనాడులో అయితే ఏదో ఒక గుడిలో పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల నయనతార, విగ్నేష్‌లు కుంభకోణంలో ఉన్న ఓ గుడికి వెళ్లి అక్కడ సందడి చేశారు.

ఇది తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి ఫొటోలు దిగడానికి తోసుకుంటూ వచ్చారు.ఆ టైంలో నయనతార చాలా ఇబ్బంది పడింది. అక్కడి నుండి ఏదో ఒక విధంగా బయటపడింది ఈ బ్యూటీ. అయితే అటు తర్వాత అక్కడి నుండి వేరే ప్రదేశానికి వెళ్లడం కోసం ట్రైన్ ఎక్కారు నయన్, విగ్నేష్‌లు. ఈ క్రమంలో నయన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె ట్రైన్ ఎక్కినా టైంలో కొంతమంది మేము ఫ్యాన్స్ అంటూ ఆమెను తాకారు.

ఇది నయన్ (Nayanthara) కు నచ్చలేదు. ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె భర్త ముందే వారు నయన్ ను ఆ రకంగా తాకడంతో… వారి వైపు ఓ సీరియస్‌ లుక్ ఇచ్చింది నయన్. తర్వాత ఆ కుర్రాళ్ళు కూడా నయన్ కు మరింత కోపం వచ్చేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది. ఇక నయన్- విగ్నేష్ లు సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus