నయనతార కొంచెం తగ్గు..!!

కేరళ కుట్టి నయనతారపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. బన్నీని అవమానించినందుకు ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. వేషాలు తగ్గిస్తే మంచిదని హితవు పలుకుతున్నారు. ఇంతకీ స్టైలిష్ స్టార్ అభిమానుల కోపానికి కారణం ఏమిటంటే … గతవారం సింగపూర్ లో ‘సైమా అవార్డ్స్’ కార్యక్రమం వైభవంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ పరిశ్రమలకు చెందిన తారలతో సైమా వేదిక కళకళలాడింది.

గతేడాది దక్షిణాది చిత్రాల్లో ఉత్తమంగా నటించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. తమిళంలో “నాను రౌడీదాన్(నేనూ రౌడీ)” సినిమాలో లీడ్ రోల్ పోషించిన నయనతార ఉత్తమనటిగా ఎంపికయ్యారు. ఈ అవార్డుని అందించేందుకు నిర్వాహకులు అల్లు అర్జున్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఉత్సాహంగా వేదికపై వెళ్లిన బన్నీకి అవమానం ఎదురైంది. స్టేజ్ పైకి వచ్చిన నయన తార అల్లు అర్జున్ నుంచి అవార్డు అందుకునేందుకు వెళ్ళలేదు. తనకి విఘ్నేష్ చేతుల మీదుగా అవార్డ్ ని స్వీకరించాలని ఉందని చెప్పింది. ఆమె కోరిక మేరకు నాను రౌడీదాన్ డైరెక్టర్ విఘ్నేష్ వచ్చి అవార్డును అందచేశారు.

ఇదంతా మౌనంగా చూస్తున్న బన్నీకి లోపల కోపం రగిలి పోయింది. తనని ఒక మాట కూడా అడగకుండా నయన ఇలా చేయడం పై చిర్రెత్తుకొచ్చింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అభిమానులు ఆమెపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విరుచుకు పడుతున్నారు. వరుస విజయాలతో నయనకు కళ్ళు నెత్తిన వచ్చాయని ఘాటుగానే విమర్శిస్తున్నారు. దర్శకుడి చేతుల మీదుగా అందుకోవాలని ఉంటే ముందే నిర్వాహకులు చెప్పాలని గానీ.. తీరా స్టేజ్ పైకి వచ్చాక బన్నీని అవమానించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus