Nayanthara Remuneration: నయనతార రెమ్యునరేషన్ పెరిగినట్లే

సినిమా హీరోయిన్స్ ఈ రోజుల్లో ఐదేళ్ల వరకు నిలదొక్కుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఎవరో ఒకరు హాట్ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు ఎంత మంచి వచ్చినా కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారను కొట్టే వల్లే లేరని చెప్పవచ్చు. ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్ళు కావొస్తున్నా కూడా అమ్మడు అదే స్టార్ డమ్ ను కొనసాగిస్తోంది.

36 ఏళ్ళ వయసులో కూడా నయన్ యువ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ను మెయింటైన్ చేస్తోంది. దాదాపు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేయగా నయన్ ఇంతవరకు అటువైపు చూడలేదు. ఇక అట్లీ ద్వారా బాలీవుడ్ లో మొదటి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సంఖీ అంటే టైటిల్ చర్చలో దశలో ఉంది. ఇక ఆ సినిమాకు హీరోయిన్ గా నయన్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం 4కోట్ల నుంచి 5కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్న నయనతార ఇక బాలీవుడ్ కు వెళ్లింది అంటే ఈజీగా మరో రెండు కోట్లను పెంచే అవకాశం లేకపోలేదు. షారుక్ ఖాన్ కాబట్టి సినిమా భారీగానే ఉంటుంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus