దర్శకనిర్మాతలను ముప్పతిప్పలు పెడుతోన్న లేడీ సూపర్ స్టార్

నయనతారకు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ లు అవసరం లేదు. ఒకపక్క అగ్ర కథానాయకులతో నటిస్తూనే.. యువ హీరోలతోనూ సరసాలాడేస్తుంది. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసేస్తోంది. ఇక పర్సనల్ లైఫ్ లోనూ సఖుడు విగ్నేష్ శివన్ తో హ్యాపీగా గడిపేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంది. అక్కడితో బాగానే ఉంది కానీ.. అమ్మడు ఈమధ్య దర్శకనిర్మాతలను తన రెమ్యూనరేషన్ తో చుక్కలు చూపిస్తోందట. ఇటీవల ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న నయనతార అందర్నీ షాక్ కు గురి చేసింది.

కథ బాగుండడంతో ఆర్జే బాలాజీని పిలిపించుకొని మరీ సినిమా సైన్ చేసిన నయనతార ఇప్పుడు రెమ్యూనరేషన్ గా 8 కోట్ల రూపాయలు అడిగిందట. తెలుగు-తమిళ భాషల్లో నయనతారకు మంచి క్రేజ్ & మార్కెట్ ఉన్నప్పటికీ మరీ 20 కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి మాత్రం నయనతార ఇంకా చేరుకోలేదు. అలాంటప్పుడు కేవలం తన రెమ్యూనరేషన్ గానే 8 కోట్ల రూపాయలు అడిగితే.. ఇక ప్రొడక్షన్ & పబ్లిసిటీకి దర్శకనిర్మాతలు బడ్జెట్ ను ఎలా సరిపెట్టుకోవాలి అంటూ దర్శకనిర్మాతలు ఆలోచనలోపడ్డారు. మరి నయనతార కూడా ఈ విషయాన్ని కాస్త పరిగణలోకి తీసుకొని.. తన రెమ్యూనరేషన్ తగ్గించుకొంటే మంచిది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus