Nayanthara, Vignesh: నయన్ విఘ్నేష్ హనీమూన్ కు అక్కడికి వెళ్లారా?

ఈ నెల 9వ తేదీన మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేష్ పెళ్లి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజమో కాదో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ దంపతులు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీనివాసుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయితే ఆ సమయంలో నయన్ విఘ్నేష్ ఒక వివాదంలో చిక్కుకున్నారు.

అయితే ప్రస్తుతం నయన్ విఘ్నేష్ హనీమూన్ కోసం బ్యాంకాక్ కు వెళ్లారని బోగట్టా. బ్యాంకాక్ లోని లగ్జరీ హోటల్ లో ప్రస్తుతం నయన్ విఘ్నేష్ ఉన్నారని తెలుస్తోంది. విఘ్నేష్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అభిమానులు నయన్ విఘ్నేష్ లతో విమానంలో ఫోటోలు దిగగా ఆ ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అటు నయనతార ఇటు విఘ్నేష్ శివన్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ కావాల్సి ఉండటంతో ఇప్పుడే మధురమైన జ్ఞాపకాలను కూడబెట్టుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి ప్రేక్షకుల్లో విఘ్నేష్ శివన్ తో పోల్చి చూస్తే నయనతారకు ఎక్కువ క్రేజ్ ఉంది. వయస్సులో కూడా విఘ్నేష్ శివన్ తో పోల్చి చూస్తే నయన్ పెద్ద అనే సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేష్ జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నయన్ హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో కాత్తువాకుల రెండు కాదల్ అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

నయన్ విఘ్నేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నయనతార ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. నయనతార కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

1

2

3

4

5

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus