Nayanthara, Vignesh Shivan: స్పెయిన్ లో బాగా ఎంజాయ్ చేస్తున్న విక్కీ- నయన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఇటీవల తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నయనతార సినిమాలకు దూరమవుతుందని ప్రచారం జరిగినప్పటికీ అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. పెళ్ళికి ముందు ఆమె సైన్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే ఆమె లేని పార్ట్ షూటింగ్ ను జరుపుతూ వచ్చారు.

కొద్దిరోజులుగా ఒక్కో సినిమాకు ఆమె కాల్ షీట్లు అడ్జస్ట్ చేస్తూ వస్తోంది. మరో వైపు ఛాన్స్ దొరికితే చాలు తన భర్తతో కలిసి వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. పెళ్ళికి ముందు కూడా ఈ జంట విదేశాలకు వెళ్లి సేద తీరి వచ్చేది. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. ప్రస్తుతం ఈ జంట స్పెయిన్‌లో ఎంజాయ్ చేస్తుంది.ముందుగా బార్సిలోనా నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించి ఆ ఫోటోలను తమ అభిమానులతో పంచుకున్న ఈ జంట….

ఇప్పుడు అక్కడ స్పెయిన్ వీధుల్లో తెగ తిరిగేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరో హీరోయిన్లు డ్యూయెట్లు పాడుకుంటున్నప్పుడు ఎలాంటి ఫోజులు ఇస్తారో సరిగ్గా అలాగే ఈ జంట ఫోటోలకు ఫోజులు ఇస్తుండడం విశేషం.ఈ ఫోటోలను సూపర్ టాలెంటెడ్ స్పానిష్ ఫోటోగ్రాఫర్ తీసాడట. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus