పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయిన ఓ అందమైన వేడుక. ఇది జీవితాంతం గుర్తుంచుకోవాలని సామాన్య ప్రజలు కూడా వేలకు వేలు, కొంతమంది అయితే లక్షలకు లక్షలు చెల్లించి మరీ కెమెరామెన్ లను పెట్టుకుంటూ ఉంటారు. అయితే స్టార్ సెలబ్రిటీలకు మాత్రం రివర్స్ లో ఓటీటీ సంస్థలు టెలికాస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. పెళ్ళిని టెలికాస్ట్ చేయడానికి కూడా కోట్లకు కోట్లు వధూవరులకు చెల్లించడానికి వెనుకాడడం లేదు. బాలీవుడ్ స్టార్లు విక్కీ కౌశల్- కత్రీనా కైఫ్ ల పెళ్లిని టెలికాస్ట్ చేయడం కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ వారికి రూ.80 కోట్లు చెల్లించి రైట్స్ ను దక్కించుకుంది.
రాజస్థాన్ లోని కోటలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నయన్- విగ్నేష్ ల పెళ్లి వేడుకని టెలికాస్ట్ చేయడానికి కూడా నెట్ ఫ్లిక్స్ వారు భారీ రేటు చెల్లించారు. నయన్- విగ్నేష్ ల పెళ్లిని ఓ డాక్యుమెంటరీలా చిత్రీకరించే బాధ్యతని అక్కడి స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. విగ్నేష్ కు గౌతమ్ మీనన్ గురువు లాంటి వారు. పైగా రొమాంటిక్ స్టోరీలు ఆయనలా చిత్రీకరించే దర్శకుడు ఇప్పుడైతే కోలీవుడ్లో లేరు.
ఆయన తెరకెక్కించిన ప్రేమ కథలను మనం ఇప్పుడు చూసినా మనకి ఫ్రెష్ ఫీలింగ్స్ ను ఇస్తుంటాయి. ఇదిలా ఉండగా.. ఇక నయన్- విగ్నేష్ ల పెళ్లి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటు చెల్లించి దక్కించుకుంది. అందుతున్న ప్రకారం రూ.30 కోట్ల వరకు నెట్ ఫ్లిక్స్ వారు నయన్ పెళ్లి కోసం చెల్లించినట్టు భోగట్టా. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.