Nayanthara: న‌య‌న‌తార ఇంట ఓన‌మ్ సెల‌బ్రేష‌న్స్…వైరల్ అవుతున్న విఘ్నేష్ – నయన్ ఫ్యామిలీ ఫొటోస్!

తెలుగు, త‌మిళ భాష‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ న‌య‌న‌తార‌. త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ఏడేళ్లుగా ప్రేమ‌లో ఉన్న న‌య‌న‌తార ఫైన‌ల్‌గా అత‌న్ని పెద్ద‌ల అంగీక‌రాంతో పెళ్లి చేసుకోవ‌డం తెలిసిందే. ఆ త‌రువాత స‌రోగ‌సీ ద్వారా ఇద్ద‌రు క‌ల‌వ‌ల పిల్ల‌కు త‌ల్లైన న‌య‌న‌తార వైవాహిక జీవితంలో పాటు సినీ లైఫ్‌ని కూడా అంతే ఆనందంగా లీడ్ చేస్తోంది. పెళ్లి త‌రువాత తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విఘ్నేష్ న‌య‌న్ ఇప్పుడు వివాదాల‌కు దూరంగా ఉంటూ ఇద్ద‌రు క‌ల‌వ‌ల పిల్లతో హ్యాపీ గ‌డుతున్నారు.

ప్రేమ‌, ఆ త‌రువాత పెళ్లి, స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌లు..ఇలా వ‌రుస వివాదాల‌తో కొంత వ‌ర‌కు ఇబ్బందుల్ని ఎదుర్కొన్న విఘ్నేష్ -న‌య‌న్‌ల జంట ఆ వివాదాల‌న్ని స‌మ‌సిపోవ‌డంతో ప్ర‌స్తుతం త‌మ క‌వ‌ల పిల్ల‌తో హ్యాపీగా కాలాన్ని గ‌డిపేస్తున్నారు. తొలిసారి త‌మ క‌ల‌వ‌ల పిల్ల‌లు ఉయిర్ రుద్ర‌నీల్ ఎన్‌. శివ‌న్‌, ఉళ‌గ‌దైవ‌గ్ ఎన్‌.శివ‌న్‌ల‌తో క‌లిసి ఓన‌మ్ ఫెస్టివెల్‌ని న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ జ‌రుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

సంప్ర‌దాయ బ‌ద్దంగా వైల్ అండ్ వైడ్‌లో త‌మ పిల్ల‌ల‌ని రెడీ చేసిన న‌య‌న‌తార, విఘ్నేష్ శివ‌న్ ఇద్ద‌రు కూడా వైట్ సారీ, వైట్ లుంగీ ధ‌రించి క‌నిపించారు. అంతే కాకుండా న‌య‌న‌తార షేర్ చేసిన ఉళ‌గ్, ఉయిర్‌ల ఫొటోలు కూడా ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. పిల్ల‌ల ఫొటోలు చూసిన వారంతా అప్పుడే న‌య‌న్ -విఘ్నేష్‌ల ట్విన్స్ ఇంత పెద్ద వాళ్ల‌య్యారా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. న‌య‌న‌తార గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో స‌రోగ‌సీ ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే న‌య‌న‌తార ఈ ఏడాది బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మించిన `జ‌వాన్‌` మూవీతో న‌య‌న‌తార బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతోంది. `ప‌ఠాన్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత షారుక్ న‌టించిన సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే రికార్డు స్థాయి బిజినెస్ జ‌రుపుకున్న `జ‌వాన్‌` సెప్టెంబ‌ర్ 7న అత్యంత భారీ స్థాయిలో హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus