NBK107: ‘మైత్రి’ వారి నుండి మళ్ళీ లీకులు షురూ..!

‘మైత్రి మూవీ మేకర్స్’ .. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతుంది. ఈ సంస్థలో రూపొందే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఖర్చుకు వెనుకాడకుండా ఈ బ్యానర్లో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. ఆ సినిమాలు కచ్చితంగా సూపర్ హిట్ అవుతాయి అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడుతుంటుంది. అయితే ఈ బ్యానర్ పై కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి. షూటింగ్ స్పాట్ లో ఉన్న సినిమాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరు అని..

సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీలో వదిలేస్తారు అనేవి ఆ కంప్లైంట్లు. ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ సినిమాల విషయంలో ఈ రెండు విషయాలు ప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విషయంలో కూడా లీకులు పరంపర కొనసాగుతుంది అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ఎన్బీకే 107’ కి సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ వంటివి లీక్ అయ్యాయి.

నిన్నటి నుండి వీడియోలు కూడా లీక్ అవుతున్నాయి.అందులో ఓ సాంగ్ కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కర్నూల్ లో జరుగుతుంది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలు.. ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. వీటికి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న శృతి హాసన్, సోనియా చౌదరి, మీనా కుమారి, రజిత ల మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు లీకైన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా ‘జై బాలయ్య.. జై జై బాలయ్య’ అంటూ సాగే ఓ పాట కూడా బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇది నిజంగా సినిమాలో ఉన్న పాటేనా? లేక బాలయ్య కోసం అభిమానులు కంపోజ్ చేసిన ప్రైవేట్ సాంగా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ పాట కొంచెం ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ ను గుర్తుచేసే విధంగా ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus