Varalaxmi Sarathkumar: ఆ పాత్రలకు వరలక్ష్మి దూరంగా ఉంటే బెటర్!

క్రాక్ సినిమా సక్సెస్ వల్ల వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు. కొన్ని సినిమాలలో మాస్ రోల్స్ తో మరికొన్ని సినిమాలలో క్లాస్ రోల్స్ తో వరలక్ష్మీ శరత్ కుమార్ ఆకట్టుకుంటున్నారు. యశోద మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న మధు పాత్రలో కనిపించారు. క్లాస్ రోల్ అయిన ఈ రోల్ కు వరలక్ష్మి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరలక్ష్మికి మాస్ పాత్రలు సూట్ అయిన స్థాయిలో క్లాస్ పాత్రలు సూట్ కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

వరలక్ష్మి రాబోయే రోజుల్లో కూడా మాస్ రోల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యశోద సినిమా తొలిరోజు కలెక్షన్లు 3.2 కోట్ల రూపాయలుగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోపు ఈ సినిమా 10 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో 50 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో ఈ సినిమా ప్రదర్శించబడుతుండటం గమనార్హం.

ఈ వీకెండ్ కు థియేటర్లలో సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు యశోద సినిమానే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. యశోద మూవీ నటిగా సమంత రేంజ్ ను మరింత పెంచిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సమంత భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మాక సినిమాలలో నటించాలని నెటిజన్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సమంత విజయాలను అందుకుంటున్నారు.

నయనతార తర్వాత ఆ స్థాయిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సమంత మాత్రమే సక్సెస్ లను అందుకున్నారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులకు సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus