ప్రతి ఏడాది ‘బతుకమ్మ’ పండగ సమయంలో ప్రత్యేక గీతాలు విడుదలవుతూ ఉంటాయి. కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈసారి బతుకమ్మ సాంగ్ కోసం ఏఆర్ రెహ్మాన్, గౌతమ్ మీనన్ వంటి దిగ్గజాలను రంగంలోకి దింపింది. దీంతో పాట ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ ఊహించారు. జాగృతి సంస్థ కూడా అలానే ఊహించి ‘బతుకమ్మ’ పాటను వారిలో చేతిలో పెట్టింది. ఇప్పటివరకు జాగృతి రూపొందించి బతుకమ్మ పాటలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.
ఈసారి రెహ్మాన్ మ్యూజిక్, గౌతమ్ మీనన్ టేకింగ్ కావడంతో అదిరిపోతుంది ఆశించారు. ఈరోజే ఆ పాటను విడుదల చేశారు. కానీ పాట విన్నవారంతా పెదవి విరుస్తున్నారు. రెహ్మాన్ రేంజ్ లో పాట లేదని సాదా సీదా ట్యూన్ తో కానిచ్చేశారని కామెంట్స్ వస్తున్నాయి. టేకింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. గౌతమ్ మీనన్ రేంజ్ లో లేవని అంటున్నారు. జాగృతి వాళ్ల ప్రయత్నం మంచిదే కానీ రెహ్మాన్-గౌతమ్ తమ స్థాయికి తగ్గ పాట ఇవ్వలేకపోయింది.
తెలంగాణ సంస్కృతి సంప్రాయాలను అవగాహన చేసుకున్నవాళ్లతో పాట చేయించి ఉంటే బాగుండేదని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సలహాలు ఇచ్చినా.. పాట రిలీజైపోయింది కాబట్టి ఇకచేసేదేం లేదు.
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!