Sonu Sood: సోనూసూద్ హీరోనా లేక విలనా..?

  • May 17, 2021 / 05:43 PM IST

కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న చాలా మందికి సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడం నుండి నిరుపేదలను ఆదుకోవడం వరకు అన్ని పనులు చేశాడు. ఇప్పుడు రెండో దశలోనూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది అభిమానులు ఇతరులకు సాయం చేస్తున్నారు. సోనూ నిస్వార్థ సేవను మెచ్చి పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు ఆయనకు సన్మానం చేశారు. ఇటీవల కోవిడ్ బారిన పడి కోలుకున్న సోనూ.. సేవా కార్యక్రమాల్లో వేగం పెంచారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల అవసరాలు తెలుసుకొని సాయం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా సోనూసూద్ స్కామ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. కొందరైతే ప్రూఫ్ లతో సహా.. సోనూ స్కామ్ ని నిరూపిస్తున్నారు. కొందరు వ్యక్తులు సోనూసూద్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఆంబులెన్స్ లో పలు ప్రాంతాలకు వెళ్లి.. సోనూసూద్ ఫౌండేషన్ నుండి వచ్చామని.. డొనేషన్స్ ఇవ్వమని అడుగుతున్నారట. దీనిపై రీసెర్చ్ చేసిన కొందరు యూట్యూబర్స్, బ్లాగర్స్ సదరు ఆంబులెన్స్ సోనూసూద్ కి చెందినదేనని చెబుతున్నారు.

దీంతో పాటు ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ల సంగతి బయటపెట్టారు. సోనూసూద్ రీట్వీట్ చేస్తూ హెల్ప్ చేస్తున్న ట్విట్టర్ అకౌంట్స్ లో దాదాపు అన్నీ ఫేక్ అకౌంట్స్ అని తేల్చి చెబుతున్నారు. ఇద్దరు, ముగ్గురు ఫాలోవర్స్.. ఒకే ఒక్క ట్వీట్ ఉన్న పోస్ట్ లను సోనూ రీట్వీట్ చేస్తూ సాయం చేశానని చెబుతుండడం ఆశ్యర్యపరుస్తోంది. కొందరైతే సోనూని ట్యాగ్ చేయకుండా.. ఎలాంటి డీటైల్స్ ఇవ్వకుండా సాయం చేయమని అడగం, దానికి వెంటనే సోనూ స్పందించడం వంటి విషయాలు అనుమానాలను కలిగిస్తున్నాయి.

నిమిషానికి వందల సంఖ్యలో ట్యాగ్ చేసిన ట్వీట్స్ వస్తున్నప్పుడు ఎలాంటి ట్యాగ్ లేని పోస్ట్ లు సోనూ కంట ఎలా పడుతున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మరో ట్వీట్ అయితే సైన్స్ ని మించిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ స్టోరీ ఏంటంటే.. సోషల్ వర్కర్ మనోజ్ అనే వ్యక్తి హాస్పిటల్ లో బెడ్ కావాలంటూ అర్ధరాత్రి 1 గంటకు సోనూని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దానికి సోనూ తెల్లవారుజామున 9 గంటలకు రిప్లై ఇస్తూ.. ‘ఒక్కోసారి అర్ధరాత్రి మేల్కొని ఉండడం వలన మంచే జరుగుతుందని.. కేర్ హాస్పిటల్ లో మీకు బెడ్ ఎరేంజ్ చేశా’ అంటూ రాసుకొచ్చాడు.

ఇక్కడ హైలైట్ ఏంటంటే.. పేషంట్ తెల్లవారుజామున 3:30కి చనిపోయాడు. ఈ విషయంలో కొందరు చనిపోయిన వ్యక్తికి బెడ్ ఎలా ఎరేంజ్ చేశావంటూ సోనూని ట్రోల్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన సోనూ.. రాత్రి 12 గంటలకే బెడ్ దొరికిందని.. పేషంట్ 3:30కి చనిపోయారని మరో ట్వీట్ వేశాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. సదరు సోషల్ వర్కర్ బెడ్ కావాలని అడిగింది రాత్రి 1గంటకు.. కానీ సోనూ మాత్రం రాత్రి 12 గంటలకే బెడ్ ఎరేంజ్ చేసేశాడు. దీంతో సోనూ టైమ్ ట్రావెల్ చేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ట్వీట్స్ ఉన్నాయి. ఓ అమ్మాయి కావాలనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ప్లాస్మా కావాలని సోనూకి రిక్వెస్ట్ పెట్టింది. పాపం ఆ విషయం తెలియని సోనూ.. ‘ప్లాస్మా డెలివర్ చేశామంటూ’ రీట్వీట్ చేశాడు. దీంతో సదరు యువతి దయచేసి ఈ స్కామ్ ను ఆపాలంటూ మరో ట్వీట్ చేసింది. కరోనా మొదటి దశ సమయంలో సోనూ ఎన్నో సేవలు చేసిన మాట నిజం. కానీ సెకండ్ వేవ్ సమయంలో కావాలనే ఇలా స్కామ్ చేస్తున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు సోనూ కంటపడతాయేమో చూడాలి!


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus