సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. హీరోలకు ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చిందంటే.. అరవై ఏళ్లు వచ్చినా ఇంకా హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. ప్లాప్ లు వచ్చినా.. గ్లామర్ తగ్గినా ఇంక అంతే సంగతులు. అందుకే తమకు క్రేజ్ ఉన్న సమయంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ సంపాదించుకుంటారు. నాలుగేళ్ల క్రితం వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్.
ఆ తరువాత టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు డిమాండ్ పెరగడంతో రకుల్ అడ్రెస్ లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాలు చేస్తున్నా.. అప్పటి క్రేజ్ మాత్రం లేదిప్పుడు. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయాయి. కోలీవుడ్ లో కూడా పెద్దగా డిమాండ్ లేదు. దీంతో బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ‘దే దే ప్యార్ దే’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకి ‘సర్ధార్ కా గ్రాండ్ సన్’ అనే పెద్ద సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, అదితిరావు హైదరి, నీనా గుప్తా లాంటి తారలతో ఈ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమాను థియేటర్లో విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితుల వలన ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను చూసిన వారంతా పెదవి విరుస్తున్నారు. దాదాపు అన్నీ నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. కథ కొత్తగా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే బాలేదని అంటున్నారు.
ఒక్క నీనా గుప్తాకు మాత్రమే నటన పరంగా ప్రశంసలు దక్కుతున్నాయి. రకుల్ పాత్ర, నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదని మాట్లాడుతున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ ఊపందుకుంటుందని భావించిన రకుల్ కి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని బాలీవుడ్ సినిమాలున్నాయి. కనీసం వాటితోనైనా బాలీవుడ్ లో సెటిల్ అవుతుందేమో చూడాలి!
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!