Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారా.. ఏమైందంటే?

  • May 23, 2024 / 12:16 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా విషయంలో కుట్ర జరుగుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దేవర మూవీ విషయంలో జరిగిన కుట్ర నెట్టింట వైరల్ అవుతోంది. దేవర ఫియర్ సాంగ్ ప్రోమోను కొన్నిరోజుల క్రితం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ కు తక్కువ సమయంలోనే లక్ష లైక్స్ రాగా ఇప్పుడు ఆ లక్ష లైక్స్ 60 వేలకు పడిపోయాయి. బాట్స్ మూలానే ఈ విధంగా తారక్ పోస్ట్ కు లైక్స్ తగ్గాయని సమాచారం అందుతోంది. అయితే కొంతమంది కావాలనే ఈ విధంగా చేశారని అభిప్రాయాలు . ఎన్టీఆర్ పై నెగిటివిటీ పెరగాలని బాట్స్ తో లైక్స్ కొట్టించారని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ (Prabhas) పోస్ట్ లకు సంబంధించి కూడా ఈ తరహా కుట్రలు జరిగాయి.

ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ కామెంట్లకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబో మూవీ ఆగష్టు నుంచి విడుదల కానుంది.

ఈ సినిమాను ఒకింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటుండగా ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus