చరణ్ హీరోయిన్ ఐటెమ్ బాంబ్ అయిపోయింది !!
- November 30, 2016 / 02:16 PM ISTByFilmy Focus
ఇక ఇలియానా పని అయిపోయిందని అందరూ అనుకొంటున్న తరుణంలో అక్షయ్ కుమార్ సరసన “రుస్తుం”లో అవకాశం దక్కించుకోవడంతోపాటు సూపర్ హిట్ ను అందుకొని అందరి నోళ్ళూ మూయించింది. ఇప్పుడు అదే ఊపులో “ముబారకన్” అనే మరో బాలీవుడ్ ప్రోజెక్ట్ లో కథానాయికగా నటించే అవకాశం సొంతం చేసుకొంది. అర్జున్ కపూర్ కథానాయకుడిగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తోంది.
ఇప్పుడు ఇదే చిత్రంలో “చిరుత” ఫేమ్ నేహా శర్మ ఓ ఐటెమ్ సాంగ్ లో అందాలన్నీ ఆరబోసి నర్తించిందట. సూపర్ స్పైసీగా తెరకెక్కించబడిన ఈ పాట చిత్రీకరణ నిన్న పూర్తయ్యింది. ఇటీవల నేహాశర్మ నటించిన “తుమ్ బిన్ 2” బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ముందునుంచి అందాలు ఆరబోయడంలో ఎటువంటి నామోషీ చూపని నేహాశర్మ ఇకపై అదే పనిగా పెట్టుకొనేలా ఉంది. అందుకే ఈమధ్య బికినీ ఫోటోషూట్ అని, ఇంకేదో ఫోటోషూట్ అని ట్విట్టర్ ద్వారా రకరకాల భంగిమల్లో శృంగార రసాన్ని ఒలకబోస్తోంది. మరి నేహా కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తారేమో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















