చిరుత సినిమాలో రామ్ చరణ్ తేజ్ కి జోడీగా ఛాన్స్ అందుకోవడంతో నేహా శర్మ దశ తిరిగిపోయిందని అందరూ అనుకున్నారు. ఆ చిత్రం హిట్ కావడంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం దక్కించుకుందని భావించారు. కానీ తర్వాత ఆమె కుర్రాడు సినిమాకి సంతకం చేయడంతో అంతా రివర్స్ అయింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ మూవీ ఫెయిల్ కావడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కే పరిమితమయింది. అక్కడ డజనుకు పైగా సినిమాలు చేసినప్పటికీ బ్రేక్ రాలేదు. అందుకే టాలీవుడ్ వైపు చూస్తోంది. ఇలియానా బాట పట్టింది.
టాలీవుడ్ లో అవకాశాలు రావాలని బికినీ అందాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. అదే విధంగా నేహా శర్మ అందాలు ఆరబోస్తోంది. ఓ మ్యాగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది. ఇందులో నేహా శర్మ ఎరుపు, తెలుపు బికినీలు వేసుకొని యువకులను కైపెక్కిస్తోంది. ఈ ఫొటోల్లో నేహా శర్మని చూసిన వారందరూ.. వర్షాకాలంలో వేడి పుట్టిస్తోందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నారు. ఈ దెబ్బతో తెలుగులో నేహా శర్మ రీ ఎంట్రీ ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.