ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన నీల్ నితిన్ ముఖేష్

సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ చూసి ఎంతోమంది అతనిపై అభిమానులు అయిపోయారు. అలాగే అతనితో కలిసి పనిచేసిన వారు కూడా అతినికి ఫ్యాన్స్ అయిపోతున్నారు. తోటి నటుడు అని మాత్రమే కాకుండా.. ఎంతో గౌరవిస్తున్నారు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన ప్రతికథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. అందుకే ప్రభాస్ తో కలిసి నీల్ నితిన్ ఎక్కువరోజులు పనిచేస్తున్నారు. తాజాగా షూటింగ్ గ్యాప్ లో నీల్ నితిన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ” నా చిన్నప్పటి నుంచి మా నాన్న చెట్లలో మర్రి చెట్టు చాలా గొప్పది.

చెట్టు ఎంత ఎదిగినా కూడా దాని ఊడలు భూమికి చేరతాయి. అలాగే మనుషులు కూడా ఎంత సంపాధించినా,  ఎంతగా పేరు తెచ్చుకున్నా కూడా మర్రి చెట్టులా వ్యవహరించాలి అంటూ ఉండేవాడు. ప్రభాస్ ను చూస్తుంటే మర్రి చెట్టు గుర్తుకు వస్తుంది. ప్రభాస్ ఒక స్టార్ హీరో అనే విషయాన్ని ఎక్కడ కూడా చూపించకుండా వ్యవహరిస్తాడు. మేము సాహో చిత్రీకరణ కోసం దుబాయిలో ఉన్న సమయంలో నా భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పాను. రాత్రి సమయంలో నా రూమ్ కి వచ్చి భారీగా బహుమతులు ఇచ్చి, సొంతంగా పార్టీ ఇచ్చాడు. ఇతరుల సంతోషాలను ప్రభాస్ బాగా షేర్ చేసుకుంటాడు” అని నితిన్ మంచి సంగతిని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అని పిలవడానికి ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus