Nellore Peddareddy: మెహరీన్ రోజా చేతుల మీదుగా రెస్టారెంట్ ప్రారంభం!

బుల్లితెర కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి తిరిగి స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు కామెడీ షోలలో సందడి చేశారు. ఈ షోలో కూడా ఈయన ఎక్కువకాలం ఉండలేకపోయారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాల నుంచి బయటకు వచ్చినటువంటి (Kiraak RP) కిరాక్ ఆర్పీ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించి ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. మొదట హైదరాబాదులో ఒక రెస్టారెంట్ ప్రారంభించిన ఈయన అనంతరం హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో పలు బ్రాంచ్లను ఏర్పాటు చేశారు.

ఇలా హైదరాబాదులో మాత్రమే కాకుండా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రధాన ప్రాంతాలలో రెస్టారెంట్ బిజినెస్లను స్థాపించి విస్తరింప చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రలో రాయలసీమలో అనంతపురంలో తన రెస్టారెంట్ పెట్టినటువంటి కిరాక్ ఆర్పీ తాజాగా తిరుపతిలో కూడా కొత్త రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరోయిన్ మెహరీన్ అలాగే నటి రోజా హాజరై సందడి చేశారు.

ప్రస్తుతం ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రోజా చేపల పులుసు టేస్ట్ చేయమని కోరడంతో ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో తాను టెస్ట్ చేయలేనని తరువాత మరోసారి తప్పకుండా వచ్చి చేపల పులుసు టేస్ట్ చేస్తాను అంటూ రోజా తెలియజేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు కిరాక్ ఆర్పీకి ఆకాంక్షలు తెలియచేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus