రజనీకాంత్ – కమల్ హాసన్ కలసి నటిస్తే చూడాలని నిన్నటి తరం వారే కాదు, ఇప్పటితరం వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ సౌత్ ఇండియన్ ‘ఓజీ’ హీరోల కాంబినేషన్ అలా ఉంటుంది మరి. ఈ ఇద్దరి కాంబినేషన్ వచ్చి కొన్ని దశాబ్దాలు అయిపోయింది. దీంతో వన్స్ మోర్ అంటూ ఫ్యాన్స్ అంటూ చాలా ఏళ్లుగా అభిమానులు అడుగుతూనే ఉన్నాయి. ‘కూలీ’ సినిమా సమయంలో ఈ టాక్ బాగా బలంగా వినిపించింది. ఓసారి కమల్ దగ్గర ప్రస్తావిస్తే ‘అవును చేస్తాం’ అని కూడా అన్నారు.
ఇంత జరుగుతున్నప్పుడు ఎక్కువగా వినిపించిన పేరు లోకేశ్ కనగరాజ్. సౌత్ సినిమాలో పూర్తి మాస్ యాక్షన్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసినోడు అనే మంచి రెప్యుటేషన్ కూడా ఉంది. దీంతో దాదాపు ఆయన దర్శకత్వంలో రజనీ – కమల్ కలసి నటిస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ‘కూలీ’ సినిమా ఫలితం ఇబ్బందికరంగా మారడంతో ఆయన రేసులో ఉంటాడా లేదా అనే డౌట్ కలిగింది.
ఇప్పుడు ఆ డౌట్స్‌ను నిజం చేస్తూ కమల్ – రజనీ కాంబో విషయంలో మరో దర్శకుడి పేరు చర్చలోకి వచ్చింది. అయనే నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్‌కు ‘జైలర్’ లాంటి రూ.600 కోట్ల సినిమాను ఇచ్చి.. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్న ఆయన చేతిలో రజనీ – కమల్ సినిమా పెట్టే ఆలోచనలో ఉన్నారని కోడంబాక్కం వర్గాల సమాచారం. లోకేశ్ కనగరాజ్ కథలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో రజనీకాంత్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో నెల్సన్ చెప్పిన కథ లైన్ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పూర్తి కథతో మరోసారి ముగ్గురం కూర్చుందామని రజనీ చెప్పారని టాక్. ‘జైలర్ 2’ విడుదలయ్యాక ఈ మీటింగ్ ఉంటుందని, అప్పట్లోగా తన టీమ్‌తో కలసి నెల్సన్ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారని చెబుతున్నారు.