Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?
- January 30, 2026 / 11:07 PM ISTByFilmy Focus Writer
గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ డైరెక్టర్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆ సీన్‌ను మార్చేలా ఒక తమిళ దర్శకుడు జెట్ స్పీడ్‌తో దూసుకొస్తున్నారు.. ఆయనే నెల్సన్ దిలీప్‌కుమార్. డార్క్ కామెడీని మాస్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి, బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో నెల్సన్ రూటే సెపరేట్. ‘జైలర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఆయన, ఇప్పుడు నెక్స్ట్ లెవల్ ప్రాజెక్టులతో సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
Nelson Dilipkumar
నెల్సన్ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరోల నుంచి నటనను రాబట్టడమే కాదు, సైడ్ క్యారెక్టర్లతో కూడా నవ్వులు పూయించడంలో ఆయనకు ఒక యూనిక్ టేస్ట్ ఉంది. యంగ్ ఆడియన్స్‌ను మెప్పించడంతో పాటు, భారీ యాక్షన్ కోరుకునే మాస్ ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు రజినీకాంత్ లాంటి లెజెండ్ కూడా తన తదుపరి చిత్రం ‘జైలర్ 2’ బాధ్యతలను మళ్ళీ నెల్సన్ చేతికే పెట్టారు. ఈ నమ్మకమే ఆయనను ఇప్పుడు టాప్ లీగ్‌లోకి నెట్టింది.
ఇక నెల్సన్ ఫ్యూచర్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే గట్టిగా చర్చ నడుస్తోంది. తెలుగులో ఇది ఆయనకు మొదటి సినిమా కాబోతోంది. తారక్ మాస్ ఇమేజ్‌కు, నెల్సన్ క్లాస్ అండ్ డార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ కనుక క్లిక్ అయితే, సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్ల లిస్టులో నెల్సన్ పేరు మొదటి వరుసలో ఉంటుంది.
అంతేకాదు, అసలైన బాంబ్ లాంటి అప్‌డేట్ ఏంటంటే.. రజినీకాంత్ కమల్ హాసన్.. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే స్క్రీన్‌పై చూపించే మెగా మల్టీస్టారర్‌కు నెల్సన్ డైరెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా, ఫైనల్‌గా ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ నెల్సన్ చేతికే దక్కినట్లు సమాచారం. వచ్చే వారమే దీనికి సంబంధించిన స్పెషల్ ప్రోమో షూట్ కూడా జరగబోతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ తన కెరీర్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.














