జూన్ 6న నేనే రాజు నేనే మంత్రి టీజర్!

  • June 4, 2017 / 01:03 PM IST

జూన్ 6వ తేదీ దగ్గుబాటి వంశీయులకు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకమైన రోజు. నిర్మాతగా తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడంతోపాటు, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సైతం సంపాదించుకొన్న ఏకైక నిర్మాత డి.రామానాయుడు పుట్టినరోజు. ఆయన దూరమైనా దగ్గుబాటి కుటుంబం మాత్రమే కాదు ఏ తెలుగు సినిమా అభిమాని ఆయన్ను మరువడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా యువ కథానాయకుడు రామానాయుడు వారసుడు రాణా తన తాజా చిత్రమైన “నేనే రాజు నేనే మంత్రి” టీజర్ ను విడుదల చేయనున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 6న రాణా తన ట్విట్టర్ ద్వారా “నేనే రాజు నేనే మంత్రి” టీజర్ ను విడుదల చేయనున్నాడు.

ఈ సందర్భంగా రాణా మాట్లాడుతూ.. “తాతగారి జయంతి సందర్భంగా “నేనే రాజు నేనే మంత్రి” టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీజర్ తో సినిమాలో నేను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావాన్ని పరిచయం చేయనున్నాను” అన్నారు.

చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. “రాణా పర్సనాలిటీని మాత్రమే కాదు.. అతడిలోని నటుడ్ని పూర్తి వైవిధ్యంగా “నేనే రాజు నేనే మంత్రి” చిత్రంతో రీప్రజెంట్ చేస్తున్నాను. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది” అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. “రాణా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. నాన్నగారి జయంతి కానుకగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రిలు మాట్లాడుతూ.. “సురేష్ ప్రొడక్షన్ లాంటి భారీ నిర్మాణ సంస్థతో కలిసి “నేనే రాజు నేనే మంత్రి” చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపటి నుంచి రామోజీ ఫిలింసిటీలో తమిళ్ వెర్షన్ షూటింగ్ మొదలవుతుంది” అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus