Nene Vasthunna Collections: ‘నేనే వస్తున్నా’ రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ చిత్రం ‘నేనే వస్తున్నా’ పేరుతో రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంతో మొదటి నుండి మంచి హైప్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం రిలీజ్ అవ్వగా మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది.ధనుష్ డబుల్ రోల్ లో ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు.సెల్వ రాఘవన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్న ఈ మూవీ ఓపెనింగ్స్ విషయంలో కూడా నిరాశపరిచింది అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.07 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర 0.03 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.29 cr

‘నేనే వస్తున్నా’ చిత్రానికి తెలుగులో రూ.1.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.17 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజు రూ.0.12 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.29 కోట్లు షేర్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.71 కోట్ల షేర్ న రాబట్టాల్సి ఉంది. ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి కాబట్టి శని,ఆదివారాలు పుంజుకుంటే తప్ప కష్టమనే చెప్పాలి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus