అక్కినేని నాగార్జున హీరోగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేనున్నాను. 2004 లో విడుదలైన ఈ చిత్రంలో శ్రీయ, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం పై మొదటి నుండీ మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో 2004 వ సంవత్సరం ఏప్రిల్ 7 నన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
నాగార్జున ని ఓ పక్క మాస్ గా చూపిస్తూనే మరోపక్క సినిమాని అంత క్లాస్ గా ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
5.05 cr
సీడెడ్
1.70 cr
ఉత్తరాంధ్ర
2.08 cr
ఈస్ట్
0.89 cr
వెస్ట్
0.84 cr
గుంటూరు
1.03 cr
కృష్ణా
1.01 cr
నెల్లూరు
0.61 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.81 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
14.02 cr
నేనున్నాను చిత్రానికి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.14.02 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్లకు రూ.3 కోట్ల వరకు లాభాలను అందించింది. ఆ టైంలో నాగార్జునకి వరుసగా ఇది 4వ హిట్ కావడం విశేషం.