ఓటీటీ ప్రభావం పై నెట్‌ఫ్లిక్స్ సీఈవో కామెంట్స్ వైరల్!

సినిమాల విడుదల తీరులో భారత్ లో గత కొన్నేళ్లుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ రంగంలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా మంది స్టార్ హీరోలు తమ భారీ సినిమాలతో వచ్చి కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నారు. సౌత్ సినిమాల మాదిరి ఆదరణ బాలీవుడ్ సినిమాలకు తగ్గిపోతుండటంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) సీఈవో టెడ్సు స‌రండోస్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి మరింత స్పష్టత ఇచ్చాయి.

Netflix

టెడ్సు స‌రండోస్ వివరణ ప్రకారం, ఇప్పుడు ప్రజలు తమ సినిమా ఎంపికలో స్పష్టమైన మార్పులు చూపిస్తున్నారు. భారీ విజువల్స్, ప్రత్యేకమైన కథలున్న సినిమాలే ఇప్పుడు థియేటర్ల వరకు ప్రేక్షకులను లాక్కుంటాయని, మిగతా సినిమాల్ని మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో చూడాలని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఈ మార్పు ఇప్పుడు భారతదేశంలో ముదిరిపోయిందని స్పష్టంగా చెప్పారు. ఇంట్లో కూర్చుని సినిమాలు చూడడం ప్రజలకు అలవాటైపోయిందని కూడా వివరించారు.

ఓటీటీలు అందుబాటులోకి రావడం వల్ల థియేటర్ అనుభవం తప్పనిసరి అనే భావన మరిచిపోతున్నట్లు టెడ్సు అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరిగా ప్రతి సినిమా థియేటర్లో చూడాలని ప్రజలు అనుకోవడం లేదని చెప్పారు. ప్రత్యేకత ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్లో చూడాలనిపిస్తుందని, మిగతావి ఇంట్లో చూస్తే సరిపోతుందని ప్రజల మూడ్ మారిపోయిందని అభిప్రాయపడ్డారు. థియేటర్ల భవిష్యత్ కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటుందని కూడా ఆయన అభివృద్ధి విశ్లేషించారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కడ మెరుగైన అనుభవం దొరుకుతుందో అక్కడికి వెళ్తున్నారు.

సౌత్ ఇండియన్ సినిమాలు విభిన్న కథలతో, సరికొత్త విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ పాత ఫార్ములాలనే నమ్ముతుండటమే ప్రధాన సమస్యగా నిలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) సీఈవో వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమకాలీన పరిస్థితుల్లో బాలీవుడ్ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని టెడ్సు సూచించినట్లుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటీటీ విస్తరణ దశలో ఉన్న ఈ సమయంలో, ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు ఆకర్షించాలంటే ప్రాజెక్టుల విషయంలో కొత్తదనం, న్యూ కంటెంట్ మేకింగ్ అనే రెండు అంశాలు తప్పనిసరిగా కావాల్సినవని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు.

ప్రశాంత్ వర్మ జై హనుమాన్.. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus