Chiranjeevi: చిరంజీవి సినిమాలపై దృష్టి పెట్టిన నెట్ ఫ్లిక్స్.. ఏమైందంటే?

  • September 29, 2022 / 12:11 AM IST

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో వరుసగా పెద్ద సినిమాల ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ చిరంజీవి సినిమాల డిజిటల్ హక్కులను వరుసగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా హక్కులను ఈ ఓటీటీ 57 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గాడ్ ఫాదర్ తెలుగు, హిందీ, ఇతర భాషల హక్కులను కొనుగోలు చేయడంతో ఈ రేంజ్ లో ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమా హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సినిమా హిందీలో రిలీజ్ కావడం లేదు కాబట్టి తక్కువ మొత్తానికే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. వరుసగా చిరంజీవి సినిమాల హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మరోవైపు గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి జోడీ లేకపోయినా నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా తొలిరోజే 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. చిరంజీవి రీఎంట్రీలో మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆచార్య సినిమా అంచనాలను అందుకోకపోయినా చిరంజీవి మాత్రం తర్వాత సినిమాలు కచ్చితంగా అంచనాలను అందుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి సినిమాలకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఈ సినిమాలతో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus