Bimbisara, Sita Ramam: ఆయన ఆశీస్సుల వల్లే ఈ సినిమాలు సక్సెస్ సాధించాయా?

కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ తర్వాత థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రొటీన్ కథలతో తెరకెక్కిన సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం, భారీ బడ్జెట్ సినిమాలకు ఊహించని స్థాయిలో టికెట్ రేట్లు పెరగడం, మల్టీప్లెక్స్ లలో స్నాక్స్ రేట్లు ఊహించని స్థాయిలో ఉండటం, ఓటీటీలలో తక్కువ సమయంలోనే కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే.

అయితే ఆగష్టు 5వ తేదీన థియేటర్లలో విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. బింబిసార చిన్నపిల్లలు, మాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమా కావడంతో ఈ సినిమాకు సీతారామం సినిమాతో పోల్చి చూస్తే మెరుగైన కలెక్షన్లు వస్తున్నాయి. అయితే నందమూరి అభిమానులు మాత్రం బింబిసార, సీతారామం సక్సెస్ కు ఒక విధంగా అన్నగారు కారణమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది.

బింబిసార సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. సీతారామం సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను ఎంబ్లెమ్ గా పెట్టుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడం గురించి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల గురించి పాజిటివ్ గా పోస్టులు పెడుతూ ఈ రెండు సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకోవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

 

ఈ రెండు సినిమాల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కళ వచ్చిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బింబిసార, సీతారామం ఫుల్ రన్ లో సాధించే కలెక్షన్లు బయ్యర్లకు భారీస్థాయిలో లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది. కథనం అద్భుతంగా ఉండటం ఈ రెండు సినిమాల సక్సెస్ కు కారణమైంది. ఏ మాత్రం అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాలను థియేటర్లలో చూస్తే మాత్రం ఈ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచే అవకాశం దాదాపుగా ఉండదని చెప్పవచ్చు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus