Bigg Boss 5 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ – 5 విజేత ఎవరు..? ముందే చెప్తున్న నెటిజన్స్..!

బిగ్ బాస్ సీజన్ – 5 అనేది ఈసారి అంత ఆసక్తికరంగా లేదు. బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ ఇదే మాట చెప్తున్నారు. బిగ్ బాస్ సీజన్ లోకి ఎవరైనా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సంపాదించుకున్నవాళ్లు వస్తే వాళ్లు ఒకటి రెండు వారాలు నామినేషన్స్ లోకి వచ్చినా కూడా సేఫ్ అయిపోతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎలాంటి పాపులారిటీ , ఫేమ్ లేనివాళ్లు బిగ్ బాస్ హౌస్ లో తమ గేమ్ తోనే ఆకట్టుకోవాల్సి వస్తోంది. ఇక గత రెండు సీజన్స్ గా గేమ్ చూసి ఓటు వేసే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. అందుకే స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్నవాళ్లు సైతం మొదటి ఐదు ఆరు వారాల్లోనే ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నారు. లాస్ట్ సీజన్ లో దేవినాగవల్లి, కుమార్ సాయి, నోయల్ లాంటి వాళ్లు కూడా చివరి వరకూ వెళ్లలేని పరిస్థితి. ఇక ఇప్పుడు కూడా ఈసీజన్ లో అదే పరిస్థితి మొదలైంది.

ఈ సీజన్ లో సోషల్ మీడియాలో మంచి పాపులాటినీ సంపాదించుకున్న షణ్ముక్ జస్వంత్ ఇప్పుడు టైటిల్ రేస్ లో దూసుకుపోతున్నాడు. నిజానికి ఈసీజన్ స్టార్ట్ అయినపుడు రేసులో చాలామంది ఉన్నారు. విశ్వ, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్ ఇలా అందరూ టైటిల్ రేసులో ఉన్నారు. అయితే గత కొన్ని వారాలుగా నామినేషన్స్ లోకి వస్తున్న షణ్ముక్ ఓటింగ్ చూస్తుంటే అతడే ఈసీజన్ విన్నర్ అవుతాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, శ్రీరామ్, సన్నీ, రవిల కంటే కూడా ఓటింగ్ లో టాప్ లో ఉంటున్నాడు షణ్ముక్ జస్వంత్. దీన్ని బట్టీ చూస్తుంటే అతడే ఈసీజన్ విన్నర్ పక్కా రాస్కోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజిన్స్.

అయితే, గేమ్ పరంగా చూస్తే మాత్రం షణ్ముక్ కి టైటిల్ వస్తే ఖచ్చితంగా అది అన్ ఫెయిర్ అవుతుందని అంటున్నారు. లాస్ట్ టైమ్ కూడా ఇలాగే అస్సలు టాస్క్ లలో ఎగ్రెసివ్ గా ఆడకుండా సోఫాలో కూర్చుని హాట్ వాటర్ తాగే అభిజిత్ కి వచ్చిందని ఇప్పుడు కూడా టాస్క్ లు ఆడకుండా మోజ్ రూమ్ లో చిల్ అయ్యే షణ్ముక్ కి వస్తే అస్సలు బిగ్ బాస్ షోకి అర్ధమే లేదని అంటున్నారు. ఇక మరోవైపు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా షణ్ముక్ కి టఫ్ ఫైట్ ఇచ్చేలా పార్టిసిపెంట్స్ ని రెడీ చేసేలాగానే కనిపిస్తోంది. ఒకవేళ షణ్ముక్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో టఫ్ ఫైట్ ఇవ్వాలంటే అది సన్నీ ఇంకా మానస్, శ్రీరామ్ ల చేతుల్లోనే ఉందని వీళ్లలో ఒక్కరు క్లిక్ అయినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని బిగ్ బాస్ రివ్యూవర్స్ అంచనాలు వేస్తున్నారు. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus