నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్2’ కి విజేతగా నిలిచాడు కౌశల్. ఆ సీజన్లో ఈయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గేమ్ లో భాగం అంటూ కంటెస్టెంట్ లకు చిరాకు పుట్టించి.. వాళ్ళ టెంపర్ రేపేసి సహనం కోల్పోయేలా చేసేసేవాడు. దీంతో అతని పై హౌస్మేట్స్ అందరూ యాంటీగా తయారవ్వడంతో.. కౌశల్ పై జాలిపడి ‘కౌశల్ ఆర్మీ’ ని ఏర్పాటు చేసి కౌశల్ కు మద్దతు పలికేవారు. కౌశల్ నామినేషన్స్ కు వచ్చిన ప్రతీసారి అందరూ ఏకమయ్యి ఓట్లు వేసి సేఫ్ చేసేవారు. నచ్చని కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తూ చెమటలు పట్టించేవారు. ఫైనల్ గా కౌశల్ ను విన్నర్ ను చేశారు. ఇక విన్నర్ అయ్యి బయటకి వచ్చాక పీఎం ఆఫీస్ నుండీ ఫోన్ వచ్చిందని, డాక్టరేట్ రాబోతుందని గొప్పలు చెప్పి నవ్వులపాలయ్యాడు కౌశల్.
ఇక ఆర్మీ కూడా ఫేక్ ఆర్మీ అంటూ వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. కౌశల్ ఆర్మీ ద్వారా ఏర్పాటైన ఫౌండేషన్ కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని కూడా కౌశల్ పై ఆరోపణలు వచ్చాయి. కౌశల్ ఆర్మీ లో పనిచేసిన కొందరు యువకులు కూడా మీడియాకెక్కి కౌశల్ ఫ్రాడ్ అంటూ ఆరోపణలు చేసి వివాదాలకి తెరలేపారు. ఇదిలా ఉండగా… ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ కు కౌశల్ హాజరయ్యాడు. ఆ ఈవెంట్ లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకి కౌశల్ జవాబులు ఇచ్చాడు. ఇందులో భాగంగా.. ‘బిగ్ బాస్ సీజన్ 3’ టాప్ కంటెస్టంట్ల పేర్లు చెప్పాలని రిపోర్టర్ అడిగాడు. దానికి కౌశల్ సమాధానమిస్తూ… ‘నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ మొత్తం వారికే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మిగిలిన వారికి అన్యాయం జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కౌశల్ చెప్పిన ఈ సమాధానంతో నెటిజన్లు ఆయన్ని ఏకిపారేస్తున్నారు. ‘ఇంకా నీ ఆర్మీ ఉందా..?’ ‘నీలాంటి వాడికి సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టుకోవాలి’ ‘కౌశల్ నీకు ఇంకా అంత సీన్ లేదు’ ‘కౌశల్ ఇక భ్రమల నుండీ బయటకి రా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.