ఇప్పుడు ‘హనుమాన్’ మేనియా నడుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా విజయవంతంగా రూ.50 కోట్ల షేర్ మార్క్ ను దాటేయడమే కాకుండా, రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ సినిమాకి ఇప్పటికీ టికెట్లు దొరకడం లేదు అంటూ చాలా మంది ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ స్క్రీన్స్ పెరుగుతున్నప్పటికీ ఈ కామెంట్లు మాత్రం తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే.. తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా ‘హనుమాన్’ భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంది. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. ఇది అక్కడ కూడా రూ.50 కోట్లు పైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించే విధంగా దూసుకుపోతుంది. ఫుల్ రన్లో రూ.200 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం అయోధ్య రామమందిర నిర్మాణం ఒకటైతే, ఇంకోటి డివోషనల్ యాంగిల్. ఇలాంటి సినిమాలకు అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు.. ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి (Anji) ‘అంజి’ సినిమా రిలీజ్ అయినా భారీ కలెక్షన్స్ నమోదయ్యి ఉండేవి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అందులో కూడా గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. 2004 లో ఈ మూవీ వచ్చింది. ఆ టైంలో టెక్నాలజీ అంతంత మాత్రమే డెవలప్ అయ్యింది. ఆ రోజుల్లో కూడా దర్శకుడు కోడి రామకృష్ణ ఆ రేంజ్లో వి.ఎఫ్.ఎక్స్ ను డిజైన్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ‘అంజి’ సినిమా ఆ టైంలో సక్సెస్ అందుకోలేదు.
పైగా గ్రాఫిక్స్ వర్క్ కోసం 5 ఏళ్ళు కష్టపడి తీశారు. షూటింగ్ చాలా సార్లు వాయిదా పడుతూ రావడం వల్ల.. సీన్ సీన్ కి కనెక్టివిటీ కూడా మిస్ అయ్యింది. అందుకే ‘అంజి’ ఆ టైంలో సక్సెస్ కాలేదు. కానీ రిలీజ్ కి ముందు భారీ హైప్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఒకవేళ ఆ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా ‘హనుమాన్’ రేంజ్లో సక్సెస్ అయ్యి ఉండేది అని అంతా భావిస్తున్నారు. నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తయ్యింది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!