Rashmi: నీ ఇంటి అడ్రసు చెప్పు అంటూ..నెటిజన్లు కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ!

అందంలోను, సాయంచేసే తత్వంలోను, వివాదాలల్లోను ఏప్పుడు ముందు ఉంటుంది యాంకర్ రష్మీ. యాంకర్ గా చేస్తూనే మరో వైపు మూవీస్ లో అవకాశాలను అందుకుంది. బోల్డ్ మూవీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది రష్మీ. ఇక ఏ స్క్రీన్ ఐనా సరే గ్లామర్ షో చేయడంలో రష్మీ తర్వాతే ఎవరైనా… సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఆమెకు మూగ జీవాలంటే చాలా ఇష్టం. జంతువుల పట్ల ఎంతో ప్రేమతో ఉంటుంది.

మూగ జీవాలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే తను స్పందిస్తుంది. వీధి కుక్కలు, ఇతరు జంతువుల పట్ల ఎవరు అమానుషంగా ప్రవర్తించినా సోషల్ మీడియా వేదికగా వారిపై విరుచుకుపడుతుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన తర్వాత యాంకర్ రష్మిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే, రష్మీ మాత్రం తాను చెప్పాలనుకున్నది చెబుతూనే ఉంది. తాజాగా రష్మీ చేసిన మరో ట్వీట్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి.

అంబర్ పేటలో చిన్నారిపై కుక్కల దాడి ఘటన సమయంలో యాంకర్ (Rashmi) రష్మిపై నెటిజన్లను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. పెట్ లవర్ అయిన రష్మి ఆ సమయంలో కుక్కలకు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆమె ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి రెడీ అంటూ రష్మి సవాల్ విసిరింది. ”తప్పకుండా కొట్టొచ్చు. నేను ఒంటరిగా వస్తాను. నీ అడ్రస్ చెప్పు… ప్లీజ్! అప్పుడు చూద్దాం.

నువ్వు సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తావో? ఇది ఓపెన్ ఛాలెంజ్” అని రష్మీ ట్వీట్ చేసింది. అయితే తాజాగా రష్మి యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి 10 సంవత్సరాలు అయిందిట. ఈ విషయాన్ని తెలుపుతూ నాకు యాంకరింగ్ లో అనుభవం వచ్చిందని చెప్పింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రష్మి, ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ప్రస్తుతం ‘ఎక్స్‌ స్ట్రా జబర్ధస్త్’తో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి యాంకర్ గా చేస్తోంది. టీవీ షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus