Achor: నెటిజన్ కోరిక తీర్చిన పాపులర్ యాంకర్ ఎవరంటే..?

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో స్టార్స్‌తో ఎప్పటినుండో పరిచయమున్న ఫ్రెండ్స్‌తో క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నారు.. హాయ్, బాయ్, అప్ డేట్స్ వంటివి అడిగితే పర్లేదు కానీ కొన్నిసార్లు హద్దులు దాటేస్తున్నారు నెటిజన్లు.. దీంతో సదరు యాంకర్లు, హీరోయిన్లు ఇబ్బంది పడిన సందర్భాలూ ఉన్నాయి.. రీసెంట్‌గా పాపులర్ టాలీవుడ్ యాంకర్ స్రవంతి చోకారపుకి ఊహించని ప్రశ్న ఎదురైంది.. తన స్టైల్లో సమాధానం చెప్పి అందరికీ షాక్ ఇచ్చిందామె..

తెలుగులో ఉన్న నోటెడ్ యాంకర్లలో (Achor) స్రవంతి చోకారపు పేరు కూడా ఉంటుంది.. ఎప్పుడో కెరీర్ స్టార్ట్ చేసింది కానీ బిగ్ బాస్ హౌస్‌‌లోకి వెళ్లిన తర్వాతే గుర్తింపు వచ్చింది.. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఓ సీనియర్ హీరో సినిమా షూటింగ్ చూడ్డానికి వెళ్లగా.. అనుకోకుండా ఆ మూవీలో ఓ పాత్రలో నటించాల్సి వచ్చింది.. అప్పటి నుంచి కొన్ని చిత్రాలు చేసినా కానీ సరైన గుర్తింపు రాలేదు.. ఇక యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి పలు షోలు, ఈవెంట్స్, ఇంటర్వూస్ చేసి పాపులర్ అయింది..

ప్రశాంత్ అనే అతనితో ప్రేమలో పడి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన స్రవంతి సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తుంది.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో Ask Me అనే సెషన్ నిర్వహించింది స్రవంతి.. నెటిజన్లు ఆమెను రకరకాల ప్రశ్నలడిగారు.. అన్నిటికీ కాస్త ఓపిగ్గానే సమాధానాలు చెప్పింది..

ఇక ఓ నెటిజన్.. ‘మేకప్ లేని పిక్ పెట్టొచ్చు కదా.. మీరు నేచురల్‌గా చాలా బాగుంటారు’ అన్నాడు.. దీంతో వితౌట్ మేకప్ పిక్ పోస్ట్ చేసింది.. ‘నిజంగానే నేచురల్ బ్యూటీలా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. కాగా నెటిజన్ అడిగిన వెంటనే మేకప్ లేకుండా పిక్ షేర్ చేయడంతో.. ఆ ఫోటో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.. ఇన్‌స్టాలో ఆమెను 261K మంది ఫాలో అవుతున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus