Narne Nithiin: నార్నె నితిన్ సినిమాల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా?

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే నార్నె నితిన్ నటనకు మంచి మార్కులు పడినా నటన విషయంలో నార్నె నితిన్ ఎంతో ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఎన్టీఆర్ బావమరిదికి మాస్ సినిమాలే సెట్ అవుతాయని క్లాస్ సినిమాలకు, కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు నార్నె నితిన్ దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నార్నె నితిన్ సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ్యాడ్ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. అయితే ఆలస్యంగానే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాడ్ నిర్మాతలకు మాత్రం కనక వర్షం కురిపిస్తోందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ సమయానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మ్యాడ్ సినిమా నార్నె నితిన్ కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది. నార్నె నితిన్ కథల ఎంపికలో ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నార్నె నితిన్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. మ్యాడ్ సినిమాలో నితిన్ కు ఇచ్చిన ఎలివేషన్లు సైతం అద్భుతంగా ఉన్నాయి. నార్నె నితిన్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని లక్ష్మీ ప్రణతి కోరుకుంటున్నారు.

త్వరలో నార్నె నితిన్ (Narne Nithiin) భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి మరింత క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నార్నె నితిన్ కు నందమూరి ఫ్యాన్స్ నుంచి సైతం తమ వంతు సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం. నార్నె నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus