Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై నెటిజన్ల విమర్శలు.. కానీ?

తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో విజయ్ సేతుపతి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తక్కువ సినిమాల్లోనే నటించినా తన నటనతో విజయ్ సేతుపతి క్రేజ్ ను పెంచుకున్నారు. తెలుగులో ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్న విజయ్ సేతుపతికి సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోంది. విజయ్ సేతుపతికి తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి విజయ్ సేతుపతి తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి.

Click Here To Watch

అయితే విజయ్ సేతుపతి నటించిన కొన్ని సినిమాలు తెలుగులో భారీ స్థాయిలో సక్సెస్ సాధిస్తుండగా మరికొన్ని సినిమాలు మాత్రం అంచనాలకు మించి ఫ్లాప్ అవుతున్నాయి. అయితే విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార హీరోయిన్లుగా తెరకెక్కిన కణ్మణి రాంబో ఖతీజా అనే సినిమాలో నటించగా తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమా పేరును విన్న తెలుగు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం అర్థం కాని ఇలాంటి వింత పేర్ల వల్ల ఉపయోగం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

హీరో హీరోయిన్ల పాత్రల పేర్లతో మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేసినా ఈ పేర్ల కంటే మంచి పేర్లు దొరకలేదా? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో విజయ్ సేతుపతితో పాటు సమంత, నయనతారలకు మంచి పాపులారిటీ ఉంది. వింత టైటిల్స్ వల్ల సినిమాపై అంచనాలు తగ్గే అవకాశం ఉందని సామ్, నయనతార అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన రిలీజవుతుందని మేకర్స్ ప్రకటించారు.

అదే సమయానికి తెలుగులో ఆచార్య, ఎఫ్3 సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ రెండు సినిమాలు భారీ సినిమాలు కావడంతో కణ్మణి రాంబో ఖతీజా సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరికే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus