Roja, Rajinikanth: రజినీకాంత్ ని నానా మాటలు అన్నప్పుడు సైలెన్స్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి రోజా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజాను టీడీపీ నేత ఒకరు ఇష్టానుసారం కామెంట్లు చేయడంపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో మీనా, రమ్యకృష్ణ, ఖుష్బూ, నవనీత్ కౌర్ మరి కొందరు సినీ ప్రముఖులు సైతం రోజాను సపోర్ట్ చేస్తూ ఆ నేతపై విమర్శలు చేశారు. ప్రధానంగా కోలీవుడ్ నటీమణుల నుంచి రోజాకు ఊహించని స్థాయిలో సపోర్ట్ దక్కింది. అయితే రజినీకాంత్ ని నానా మాటలు అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు మాత్రం సీరియస్ అవుతున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలం క్రితం రజనీకాంత్ ను కూడా దారుణంగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారని ఆ సమయంలో రజనీకాంత్ పై వచ్చిన ట్రోల్స్ ను ఎందుకు వ్యతిరేకించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రోజాను ట్రోల్ చేస్తే తప్పు రజనీకాంత్ ను ట్రోల్ చేస్తే తప్పు కాదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రజినీకాంత్ ని నానా మాటలు అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు మాత్రం సీరియస్ కావడం గురించి సమాధానం చెప్పాలని కొంతమంది చెబుతున్నారు.

స్పందించిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు రజనీకాంత్ కు జోడీగా నటించిన హీరోయిన్లు కావడం వల్ల కూడా ఈ ప్రశ్న వైరల్ అవుతోంది. సినిమా సినిమాకు రజనీకాంత్ మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ జైలర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. ఆ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే మూడు రెట్లు కలెక్షన్లు వచ్చాయి.

జైలర్ సీక్వెల్ కు సంబంధించి త్వరలో అప్ డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. జైలర్ సీక్వెల్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. రజనీకాంత్ (Rajinikanth) రాబోయే రోజుల్లో భారీ సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus