అలాంటి చిత్రాలలో ఒకటి భారతీయుడు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్ నటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ద్విపాత్రాభినయం లో ఆయన పోషించిన రెండు పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మూడేళ్ళ క్రితం ప్రారంభంచిన ‘భారతీయుడు 2 ‘ మూవీ షూటింగ్ మొత్తం రీసెంట్ గానే పూర్తి అయ్యింది.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మొన్న విడుదల చెయ్యగా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘భారతీయుడు’ చిత్రం క్లైమాక్స్ లో లంచం తీసుకుంటూ దేశ ప్రతిష్టకి భంగం కలిగిస్తే మళ్ళీ వస్తాను అని కమల్ హాసన్ అంటాడు. అప్పటికి ఆయన వయస్సు కచ్చితంగా 90 ఏళ్ళు. ఆ సినిమా విడుదలై ఇప్పటికి 30 ఏళ్ళు పూర్తి అయ్యింది. అంటే ‘భారతీయుడు 2 ‘ లో కమల్ హాసన్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అంటే ఆయన వయస్సు 120 ఏళ్ళు అయ్యి ఉంటుందా..?.
టీజర్ మొత్తం చూస్తూ ఉంటే ప్రస్తుత జనరేషన్(2023) కి తగ్గట్టుగానే సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అంటే శంకర్ లెక్క ప్రకారం కచ్చితంగా ఈ చిత్రం లో కమల్ హాసన్ వయస్సు 120 ఏళ్ళు ఉంటుంది అని అంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియ భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నేదుమూడి వేణు, ఢిల్లీ గణేష్, మనోబాల, జగన్, కాళిదాస్ జయరామ్, గుల్షన్ గ్రోవర్, జాకీర్ హుస్సేన్, పియూష్ మిశ్రా, అఖిలేంద్ర మిశ్రా ముఖ్య పాత్రలు పోషించారు.
అయితే, ఈ సినిమాలో నటించిన వివేక్, మనోబాల ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన నేపథ్య సంగీతం మరో ప్రధాన బలం కాబోతోంది. ఇప్పటికే కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ సినిమాకు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం బాగా పాపులర్ అయ్యింది. కాబట్టి ఈ సినిమా విషయంలోనూ అనిరుధ్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు.
ఆర్.రత్నవేలు, రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించిన (Indian 2) ఈ చిత్రానికి ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘భారతీయుడు 2’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.