Rajamouli: చెప్పుకోకపోవడమే జక్కన్నకు మైనస్ అవుతోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్.ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన అద్భుతమైన నైపుణ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ అంటారు. ఇలా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి నేడు దేశం గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకరిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు పొందిన రాజమౌళి తాజాగా చేసిన ఒక ట్వీట్ ద్వారా పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

బాహుబలి సినిమా కోసం పనిచేసిన దేవికారాణి అనే మహిళ గత కొంత కాలం నుంచి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుందని ఆమెకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ప్రతి ఒక్కరిని వేడుకున్నారు.ఈ క్రమంలోనే చాలామంది కోట్లలో పారితోషికం తీసుకునే రాజమౌళికి ఆమెకు ఆపరేషన్ చేయించడం పెద్ద లెక్క కాదు… ఆ డబ్బులను మీరే ఇచ్చి తనకు సహాయం చెయ్యొచ్చు కదా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.

అయితే తన గురించి ఈ విధంగా వస్తున్న విమర్శలపై రాజమౌళి ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఆహా వేదికగా బాలయ్య వ్యాఖ్యాతగా ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రాజమౌళి హాజరు కాగా ఈ వేదికపై బాలకృష్ణ రాజమౌళి గురించి ప్రశంసలు కురిపించారు. రాజమౌళి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఎన్నోసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు విరాళంగా ప్రకటించారని,అయితే ఈ విషయాన్ని రాజమౌళి ఎక్కడ ..ఎప్పుడు కూడా బయట చెప్పలేదని అలా చెప్పడం తనకు ఇష్టం ఉండదని బాలకృష్ణ తెలియజేశారు.

ఇక దేవికారాణి విషయంలో కూడా అదే జరిగిందని ఆయన తన వంతు సహాయం చేసిన అనంతరమే ఇతరులను తనకు సహాయం చేయాలని వేడుకున్నారని తెలుస్తోంది. ఇలా జక్కన్న చేసిన సహాయం బయటకు చెప్పక పోవడం వల్లే ఇలాంటి విమర్శలు ఎదురయ్యాయని చెప్పవచ్చు. ఇకపోతే రాజమౌళి సోషల్ మీడియా వేదికగా సహాయం కోరడంతో ఇప్పటివరకు 40 లక్షల వరకు డబ్బులు సమకూరాయని తెలుస్తోంది .ఇలా రాజమౌళి ఎవరికైనా ఏ కష్టం వచ్చినా మానవతా హృదయంతో స్పందిస్తారని ఈ టాక్ షో ద్వారా బాలయ్య బాబు రాజమౌళి మనస్తత్వం గురించి బయటపెట్టారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus