స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బుక్ మై షో నిర్వాహకులకు, భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం కొనసాగుతున్నా ఈ సినిమా రిలీజయ్యే సమయానికి సమస్య పరిష్కారమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 115 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందని చెప్పవచ్చు.
అయితే విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీవో నంబర్ 217కు వ్యతిరేకంగా పవన్ కామెంట్లు చేయడం గమనార్హం. సాధారణంగా పవన్ సినిమా రిలీజైన తర్వాత ఈ తరహా కామెంట్లు చేసినా ఎలాంటి సమస్య ఉండదు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవోను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయానికి కొత్త టికెట్ రేట్ల జీవో వస్తుందని అందరూ భావించినా ఈ జీవో అమలులోకి వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సినిమా రిలీజ్ సమయంలో పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే పవన్ కు గట్స్ ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ అనుకున్న తేదీకే విడుదలవుతున్నా భీమ్లానాయక్ హిందీ వెర్షన్ మాత్రం వారం ఆలస్యంగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
భీమ్లా నాయక్ తో పవన్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాలలో పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కడం గమనార్హం.