Kushi Movie: ఆ సినిమాలకు ఖుషి సినిమాకు మధ్య పోలికలు.. ఏం జరిగిందంటే?

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఖుషి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా సెప్టెంబర్ నెల 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈ ట్రైలర్ వేర్వేరు సినిమాలను గుర్తు చేస్తోందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాలను గుర్తు చేసి విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉంది.

హీరోయిన్ బ్రాహ్మిణ్ కావడంతో అంటే సుందరానికి, కృష్ణ వ్రింద విహారి సినిమాలను సైతం ట్రైలర్ గుర్తు చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు గీతా గోవిందం సినిమాను గుర్తు చేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన నిన్ను కోరి, మజిలీ సినిమాల ఛాయలు సైతం ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఖుషి మూవీ (Kushi Movie) ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఆ సెంటిమెంట్ ఖుషి సినిమాతో రిపీట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలోనే జరుగుతుండటం గమనార్హం.

అటు విజయ్ దేవరకొండ, ఇటు సమంత ఖుషి సినిమాతో సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఖుషి సినిమాలోని పాటలు అంచనాలకు మించి హిట్ అయ్యాయి. ఖుషి ట్రైలర్ లోని డైలాగ్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఖుషి సినిమా పవన్ ఖుషిని మరిపించే రేంజ్ హిట్ అవుతుందేమో చూడాలి. విజయ్, సమంత జోడీ బాగుందని నెటిజన్లు చెబుతున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus