Akhil: యంగ్ హీరో అఖిల్ కొత్త లుక్ పై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అఖిల్ (Akhil) తొలి సినిమా “అఖిల్” (Akhil) నుంచి “ఏజెంట్” (Agent) సినిమా వరకు ఎంతో కష్టపడ్డారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) సినిమా పరవాలేదనే స్థాయిలో ఆడినా అఖిల్ నటించిన మిగతా సినిమాలన్నీ నిరాశకు గురి చేశాయి. అఖిల్ కొత్త సినిమా ధీర అనే టైటిల్ తో తెరకెక్కుతుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి.

అయితే ఏజెంట్ మూవీ విడుదలై ఏడాది అవుతున్నా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్ రాకపోవడం గమనార్హం. మరోవైపు లాంగ్ హెయిర్ తో గాగుల్స్ పెట్టుకొని అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖిల్ లుక్ అదుర్స్ అనేలా ఉన్నా అఖిల్ కొత్త లుక్ వెనుక కారణాలేంటనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

అఖిల్ వేగంగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో అఖిల్ నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అఖిల్ కు సరైన సక్సెస్ దక్కితే ఆయన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. అఖిల్ ఏజెంట్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఖిల్ తర్వాత సినిమాల రెమ్యునరేషన్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

నాగ్ (Nagarjuna) , అఖిల్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అఖిల్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. అఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అఖిల్ త్వరలో సినిమాలకు సంబంధించి వరుస శుభవార్తలు చెబుతారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags