Allu Arjun, Trisha: బన్నీ త్రిష కాంబోలో సినిమా వస్తే అలాంటి కామెంట్లు వస్తాయా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉంది. అలవైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను అందుకున్న బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబో హిట్ కాంబో కాగా ఈ కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే ఒకప్పుడు ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే బాగుండేదని ఇప్పుడు బన్నీ, త్రిష జోడి బాగుండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు బన్నీకి త్రిష అక్కలా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా మేకర్స్ ఈ వార్తల గురించి స్పందించాల్సి ఉంది. బన్నీ, త్రిష కాంబో వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.

పుష్ప సిరీస్ సినిమాల కోసం దాదాపుగా నాలుగేళ్ల సమయం కేటాయించిన బన్నీ ఇకపై వేగంగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. వరుసగా విజయాలు దక్కుతూనే సినిమాల సంఖ్య కూడా పెరగాలని బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారని భోగట్టా. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాను కూడా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుష్ప2 సినిమాకు ఏకంగా 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని భోగట్టా. నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి 800 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ మూవీకి బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. పుష్ప సిరీస్ కొనసాగుతుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ (Allu Arjun) రాజమౌళి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus