Rajamouli: జక్కన్న స్ట్రాటజీ తెలిస్తే షాకవ్వాల్సిందే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగల్చలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి2 తెలుగునాట రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. సినీ విశ్లేషకులతో పాటు సినీ అభిమానులు సైతం ఆ సినిమా సాధించిన రికార్డులను చూసి షాకయ్యారు. తనకు మాత్రమే తెలిసిన స్ట్రాటజీలతో సినిమాలను ప్రమోట్ చేయడంలో రాజమౌళికి మరే దర్శకుడు సాటిరారనే చెప్పాలి.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలపై భారీస్థాయిలో ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే రాజమౌళి పీవీఆర్ సినిమాస్ తో డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డీల్ వెనుక జక్కన్న అదిరిపోయే స్ట్రాటజీ ఉంది. పీవీఆర్ తో డీల్ వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత రెండు నుంచి మూడు వారాల పాటు మేజర్ స్క్రీన్లను ఈ సినిమాకే ఇవ్వనున్నారు.

పెద్ద సినిమాలు రిలీజై పాజిటివ్ టాక్ వచ్చినా ముందుగా ఆర్ఆర్ఆర్ కు మాత్రమే పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో మొదటి ప్రాధాన్యత ఉండనుంది. రాజమౌళి స్ట్రాటజీలతో సినిమా రిలీజైన తర్వాత కూడా భారీగా కలెక్షన్లు వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ భారీస్థాయిలో వ్యూస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ అంచనాలను మించి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి స్నేహం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించానని చెబుతుండగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus