టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలకు ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్, థమన్ ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా వీళ్లను మ్యూజిక్ డైరెక్టర్లుగా తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు తమ వర్క్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారా అంటే లేదనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల నుంచి రెండు రోజుల గ్యాప్ లో ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ కాగా
ఈ రెండు పాటలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడం విషయంలో ఫెయిల్ అయ్యాయి. ఈ ట్యూన్లు పాత ట్యూన్లను పోలి ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్, థమన్ కొత్త ట్యూన్లను ఇవ్వలేరా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు థమన్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. థమన్, దేవిశ్రీ ప్రసాద్ 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఈ రెమ్యునరేషన్ కు పదో వంతు న్యాయం చేయడంలో కూడా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇచ్చి వీళ్లను మించి మెప్పిస్తే మాత్రం దేవిశ్రీ ప్రసాద్, థమన్ సినీ కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పాట ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని కూడా మ్యూజిక్ డైరెక్టర్లు ఆలోచించలేకపోతున్నారు.
ట్రోల్స్ ను పట్టించుకోకపోతే దేవిశ్రీ ప్రసాద్, థమన్ ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించలేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు ఇప్పటికే అనిరుధ్ పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ తెలుగులో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. నెగిటివ్ కామెంట్లపై ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.